బీసీ ఖాళీ చేసిన సీటు బీసీకే ఇవ్వాలి


  • పీజీ మెడికల్‌ సీట్లపై సుప్రీంలో జస్టిస్‌ ఈశ్వరయ్య పిటిషన్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): పీజీ మెడికల్‌ సీట్లకు సంబంధించి స్లైడింగ్‌ నిబంధనలను ప్రభుత్వ వర్గాలు సరైన పద్ధతిలో అమలు చేయడం లేదని దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ, కాళోజీ హెల్త్‌ వర్సిటీ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసె్‌సకు నోటీసులు జారీ చేసింది. జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌, అఖిల భారత బీసీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఈశ్వరయ్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ ఏ బాబ్డే, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పీజీ మెడికల్‌ ప్రవేశాలు జరిగినప్పుడు బీసీ వర్గానికి చెందిన మెరిట్‌ విద్యార్థికి ఓపెన్‌ కోటాలో లభించిన సూపర్‌ స్పెషాలిటీ కోర్సును వదులుకొని అదే కాలేజీలో లేదా ఇతర కాలేజీలో మరో సూపర్‌ స్పెషాలిటీ కోర్సుకు వెళితే.. ఖాళీ అయిన ఈ సీటుకు ఓసీ విద్యార్థికి కేటాయిస్తున్నారని పిటిషనర్‌ ఫిర్యాదు చేశారు. బీసీ మెరిట్‌ విద్యార్థి కోర్సు మారిన నేపథ్యంలో ఏర్పడిన ఖాళీని బీసీ విద్యార్థితోనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *