బీహార్‌లో నేనే రెండో లాలూ యాదవ్‌ను: తేజ్ ప్రతాప్ యాదవ్


బీహార్: సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న సమయంలో రాష్ట్రీయ జనతా దళ్ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల తీరు ఆ పార్టీ నేతల్లో కలవరం సృష్టిస్తోంది. జహనాబాద్ నుంచి ఆర్జేడీ తరపున పోటీ చేస్తున్న చంద్రప్రకాశ్‌కు మద్దతుగా లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ గురువారం ఎన్నికల ప్రాచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీహార్‌లో తానే రెండో లాలూ యాదవ్‌ను అంటూ ప్రకటించారు.
 
తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ రోజుకు 10 నుంచి 11 కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారన్న ఆయన.. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలు చూస్తున్న తేజస్వీ యాదవ్ మాత్రం అస్వస్థత కారణంగా అనేక కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నారని విమర్శించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు తలలు పట్టుకుంటున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ తీరు ప్రత్యర్థులకు మేలు చేసేలా ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
 
రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో జైలుకు వెళ్లిన తర్వాత పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ చిన్నకుమారుడైన తేజస్వీ యాదవ్ చూసుకుంటున్న విషయం తెలిసిందే.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *