బూతు డైరెక్టర్ గురించి జగన్ స్పందించడం సిగ్గు చేటు: దివ్యవాణి


హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సమస్యలపై స్పందించని వైసీపీ అధినేత జగన్.. బూతు సినీ డైరెక్టర్ విషయంలో స్పందించడం సిగ్గుచేటని ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన దివ్యవాని.. డైరెక్టర్ వర్మని అడ్డుకుని పోలీసులు మంచి పని చేశారన్నారు. వర్మకి దమ్ముంటే జగన్ ఇంట జరిగిన హత్యారాజకీయాలపై సినిమా తీయాలని సవాల్ విసిరారు.
 
లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రపై స్పందిస్తూ.. లక్ష్మీపార్వతి ఏమిటో దేశం మొత్తానికి తెలుసని దివ్యవాణి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు స్టెరాయిడ్స్ ఇచ్చి చంపిన చరిత్ర లక్ష్మీపార్వతిది అని దివ్యవాణి ఆరోపించారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఒక విషపు చుక్క అని విమర్శించారు. లక్ష్మీపార్వతి గురించి ఆమె మొదటి భర్త వీరగంథం సుబ్బారావు ఎప్పుడో చెప్పారని, వర్మ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. డైరెక్టర్ వర్మ వెనుక జగన్, విజయసాయిరెడ్డి ఉండి ఇదంతా నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *