భర్త కళ్ల ముందే భార్యపై గ్యాంగ్‌రేప్.. అంతటితో ఆగక వీడియో తీసి..


అల్వార్: రాజస్థాన్‌లోని అల్వార్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. భర్త కళ్ల ముందే భార్యపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఇటీవల జరిగిన ఈ ఘటన బాధితురాలి భర్త మంగళవారం ఫిర్యాదు చేయడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తలు బైక్‌పై వెళుతుండగా ఐదుగురు యువకులు రెండు బైక్‌లపై వచ్చి వారిని అడ్డగించారు. ఇద్దరు యువకులు ఆమె భర్తపై దాడి చేయగా.. మిగిలిన ముగ్గురూ మహిళపై అత్యంత క్రూరంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె భర్తపై దాడి చేసిన అనంతరం ఆ ఇద్దరు కూడా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అంతేకాదు, ఈ దారుణ ఘటనను వీడియో తీసి.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను నెట్‌లో పెడతామని భార్యాభర్తలను బ్లాక్‌మెయిల్ చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *