భ్రమరాంబకు కుంభహారతి


శ్రీశైలంలో భ్రమరాంబదేవికి మంగళవారం కుంభోత్సవం నిర్వహించారు. 2వేల గుమ్మడికాయలు, 3వేల కొబ్బరికాయలు, 50వేలకుపైగా నిమ్మకాయలతో భారీగా అన్నం (కుంభం)ను అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు. ఏటా చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత భ్రమరాంబదేవికి కుంభోత్సవం జరపడం ఆనవాయితీ. దీనిలో భాగంగా ఆలయానికి ఎదురుగా సింహ మండపం వద్ద అన్నం రాశిగా పోసి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించారు. ఆతర్వాత సాత్విక బలిగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలను సమర్పించారు. చివరిగా పిండివంటలతో మహానివేదన జరిపారు.
– శ్రీశైలం

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *