మండిన రాయలసీమ


విశాఖపట్నం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రతకు గురువారం రాయలసీమ మండిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడి వాతావరణం కొనసాగింది. మధ్యాహ్న సమయంలో అయితే ప్రజలు బయటకు రావడానికి వెనుకంజ వేశారు. కోస్తాలో కూడా ఎండ ప్రభావం కొనసాగింది. రాయలసీమ, కోస్తాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. గురువారం కర్నూలులో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఆవర్తనం, కర్ణాటక పరిసరాల్లో ద్రోణి కొనసాగడంతో కోస్తాలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *