మంత్రి సోమిరెడ్డి సమీక్షకు అధికారుల గైర్హాజరు


అమరావతి: ఏపీలో ఎన్నికల కోడ్- సమీక్షల వివాదం మరోమారు తెరపైకొచ్చింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు అధికారులు ఎవరూ హాజరుకాలేదు. కరవు, తుపానుపై సమీక్షకు రావాలని ఈ నెల 24నే అధికారులకు మంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖపై సమీక్ష ఉన్నందున హాజరుకాలేమని మంత్రి కార్యాలయానికి అధికారులు సమాచారమిచ్చారు. 2 గంటల పాటు వేచి చూసిన సోమిరెడ్డి అధికారుల తీరుతో వెనుదిరిగారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *