మద్యం మత్తులో భర్తను కొట్టి.. ఇంటి నుంచి గెంటేసిన భార్య


బెంగళూరు: మద్యం మత్తులో కర్రతో దాడి చేసిన భార్యపై చివరకు బాధితుడు బాణసవాడి పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం బుధవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి… బెంగళూరు బాణసవాడి మెయిన్‌ రోడ్డులో నివసిస్తున్న రూమోద్‌ మెనన్‌ (50) ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మెనన్‌ తన భార్యతో కలిసి బాణసవాడిలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం మధ్యాహ్నం ఇంట్లోనే ఇద్దరు కలిసి మద్యం సేవిస్తుండగా భార్య తనను దుర్భాషలాడుతూ తన తలపై కర్రతో బాది ఇంటి నుంచి బయటకు గెంటేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటికి తిరిగొస్తే తన ప్రాణాలు తీస్తానని బెదిరించిందని ఫిర్యాదులో ప్రస్తావించారు. బాణసవాడి పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *