మరణానికి అనుమతించండి!


  • మహారాష్ట్ర సీఎంకు పుణె వ్యక్తి లేఖ
పుణె, మే 12: అతడి వయసు 35ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నిలకడైన ఉద్యోగం లేదు. తల్లి వయసు 70ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతోంది. తండ్రి వయసు 83ఏళ్లు. తల్లిదండ్రులను కూడా సంతోషపెట్టలేకపోతున్నానని నిత్యం బాధపడుతూ.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. కారుణ్యమరణంతో కన్నుమూసేందుకు అనుమతినివ్వాలంటూ ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. పుణెకు చెందిన ఓ వ్యక్తి దీనగాథ ఇది. అయితే.. అధికారులు అతడికి కౌన్సెలింగ్‌ ఇప్పించడంతో డిప్రెషన్‌ ఆలోచనల నుంచి బయటపడ్డాడు. ‘‘అతడి లేఖ 20రోజుల క్రితం వచ్చింది. తన జీవితం పట్ల విరక్తిచెంది ఉన్నట్లు కనిపించింది. అతడు సంపన్నకుటుంబానికి చెందిన, బాగా చదువుకున్న వ్యక్తి. కౌన్సెలింగ్‌ అనంతరం ఇప్పుడు కాస్త కుదుటపడ్డాడు’’ అని ముంబై పోలీసు అధికారులు తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *