మరోసారి జ్యోతిష్యుడు ద్వారకనాథ్‌తో సీఎం భేటీ


బెంగళూరు: సంప్రదాయాలు, నమ్మకాలకు ప్రాధాన్యమిచ్చే ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం జ్యోతిష్యుడు ద్వారకనాథ్‌తో భేటీ అయ్యారు. రాజభవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా ప్రమాణస్వీకారోత్సవంలో భాగస్వామ్యులైన ముఖ్యమంత్రి కుమారస్వామి నేరుగా ఆర్‌టీనగర్‌లోని జ్యోతిష్యుడు ద్వారకనాథ్‌ నివాసానికి వెళ్లారు. సుమారు గంటకు పైగా జ్యోతిష్యుడి నివాసంలో ముఖ్యమంత్రి గడిపినట్లు తెలిసింది. మండ్య లోక్‌సభ స్థానం నుంచి కుమారుడు నిఖిల్‌ను పోటీ చేయించేందుకు సిద్దమైన తరుణంలో సీఎం కుమారస్వామి జ్యోతిష్యుడు ద్వారకనాథ్‌ను కలిసిన విషయం తెలిసిందే.
 
మరో 12 రోజులలో ఫలితాలు వెలువడుతున్న తరుణంలో సీఎం కుమారస్వామి జ్యోతిష్యుడిని కలిశారు. మండ్యలో గెలుపుఓటములపై విభిన్నమైన కథనాలు, సర్వేలు వస్తున్న తరుణంలోనే ముఖ్యమంత్రి మరోసారి జ్యోతిష్యుడిని కలిసినట్లు తెలుస్తోంది. కుమారుడు ని ఖిల్‌ జాతకం ఎలాఉంటుందో తెలుసుకునేందుకే ముఖ్యమంత్రి ఆసక్తి చూపినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జ్యోతిష్యుడి నివాసానికి వెళ్ళడంపై విభిన్నమైన చర్చలు సాగాయి. జ్యోతిష్యుడి నివాసానికి వచ్చి వెళ్ళిన వేళ ముఖ్యమంత్రిని చిత్రీకరించేందుకు వ చ్చిన మీడియాను పోలీసులు దూరంగానే అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకే పోలీసులు నియంత్రించినట్లు తెలుస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *