మరో గాంధీ వచ్చినా ఏమీ చేయలేరు: అమిత్‌షా


సమష్టిపూర్: రాహుల్ మాత్రే కాదు, ఆయన తర్వాత మరో గాంధీ వచ్చినా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఆఫ్‌స్పా) రద్దు చేయలేరని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. కాంగ్రెస్ ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మేనిఫిస్టోలో తాము అధికారంలోకి వస్తే 370 అధికరణలో ఎలాంటి మార్పులు చేయమని, ఆఫ్‌స్పాను సమీక్షిస్తామని ప్రకటించింది. ఈ హామీలపై బీహార్‌లోని సమస్టిపూర్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మండిపడ్డారు.
 
‘ఆఫ్‌స్పాను రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోంది. అదే జరిగితే ఆర్మీ సిబ్బందిపై కేసులు పెడతారు. ఆఫ్‌స్పాను రద్దు చేయవచ్చా? నేను రాహుల్ బాబాకు ఒకటి చెప్పదలచుకున్నాను. మీ జీవితకాలంలో ఎప్పటికీ ఆ చట్టాన్ని రద్దు చేయలేరు. మీరే కాదు..మీ తర్వాత మరో గాంధీ వచ్చినా ఆ చట్టం రద్దు కాదు’ అని అమిత్‌షా స్పష్టం చేశారు.
 
కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీలు కశ్మీర్‌ను ఇండియా నుంచి విడగొట్టాలని చూస్తున్నట్టు అమిత్‌షా ఆరోపించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలని ఒమర్ చెబుతుంటారని, ఇదే మహాకూటమికి చెందన నేతలు లాలూ, రబ్రీ, రాహుల్ ఈ దేశం నుంచి కశ్మీర్‌ను వేరుచేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దేశానికి మణిమకుటం కశ్మీర్ అని, హిందుస్థాన్‌లో అంతర్భాగమని అమిత్‌షా స్పష్టం చేశారు. మహాకూటమిని నడిపగలిగే నేత ఒక్కరూ లేరని, ప్రతి ఒక్కరూ రొటేషన్ పద్ధతిలో ప్రధాని పదవి చేపట్టాలని కోరుకుంటున్నవారేనని ఆయన ఎద్దేవా చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *