మల్లన్న సేవలో సుప్రీం న్యాయమూర్తి


శ్రీశైలం, ఏప్రిల్‌ 27: శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ముఖోపాధ్యాయ దంపతులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన నిర్వహించుకున్నారు. దేవస్థాన అర్చకులు, అధికారులు వారికి స్వామి, అమ్మవారి శేషవస్త్రాలను, చిత్రపటాలను, ప్రసాదాలను బహూకరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *