మళ్లీ వచ్చేస్తాం…!


  • ఫలితాలు రాకముందే పోస్టింగ్‌ ప్రయత్నాలు
  • పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ
విజయవాడ (ఆంధ్రజ్యోతి): పం డిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు తారస పడ్డారు. ఇద్దరూ ముందు యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. తర్వాత ఉద్యోగపరమైన విషయాలను ప్రస్తా వించుకున్నారు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నా వంటే, నువ్వెక్కడని ఒకరినొకరు తెలుసుకు న్నారు. ఇంకెన్ని రోజులు మళ్లీ సిటీకి వచ్చేస్తాను అని అన్నాడు ఓ ఇన్‌స్పెక్టర్‌..
 
ఇది ఈ ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల మధ్య జరిగిన సంభాషణే కాదు. ప్రస్తుతం పోలీసు శాఖలో ఎస్సై, ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు ఎక్క డైనా కలిసి పలకరించుకున్నారంటే పోస్టింగ్‌ల అంశమే ప్రధానంగా సాగుతోంది. ఎన్నికల సమయంలో జిల్లాను యూనిట్‌గా తీసుకుని 2014 ఎన్నికల సమయంలో ఇక్కడ పనిచేసిన వారిని, వరుసగా మూడేళ్లపాటు విధులు నిర్వ ర్తించిన వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల సమయంలో పక్కా సమాచారం కోసం జిల్లా, నగరంపై పట్టుఉన్న కొంతమంది లూప్‌లైన్‌ (ఎస్‌బీ, సీసీఎస్‌) వంటి విభాగాల్లో ఉపయోగించుకున్నారు. జిల్లాలో సుదీర్ఘంగా పనిచేసి ఎన్నికల సమయంలో సరిహద్దులు దాటాల్సివచ్చింది. ఎలాంటి ఆరోపణలు, విమ ర్శలకు ఆస్కారం ఇవ్వకూడదని 2014 ఎన్ని కల్లో ఇక్కడ పనిచేసి ఇతర జిల్లాలకు వెళ్లి, మళ్లీ వచ్చిన వారిని సైతం కదిపారు. ఇప్పుడు ఇలా ఇతర జిల్లాలకు వెళ్లిన వారంతా తిరిగి సొంత స్థానాలకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. లోగడ పనిచేసిన స్థానాలు కాకపోయినా మంచి పోస్టింగ్‌లు దక్కించుకో వడానికి చూస్తున్నారు.
 
విజయవాడలో సిటీలో పనిచేస్తున్న కొంతమంది ఎస్సైలను గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేశారు. వారిలోనూ ఇదే ఆలోచన ఉంది. నగరంలో పనిచేయడానికి అలవాటు పడిన ప్రాణాలు ఇతర ప్రాంతాలకు అలవాటు పడలేకపోతున్నాయి. మే 23వ తేదీ న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంది. ఇందుకు ఇం కా నెలరోజుల సమయం ఉన్నది. ఎన్నికల ఫలి తాలు ఎలా, గెలుపు ఎవరి వైపు వాలినా మం చి పోస్టింగ్‌లను దక్కించుకోవడానికి ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. జి ల్లాలో ఎక్కడెక్కడ వివాదాస్పద వాతావరణం ఉంటుంది, ప్రశాం తంగా, జాలీగా పని ఏయే ప్రాంతాల్లో నడుస్తుందన్న దానిపై వాకబు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది విజయవాడ నగరంలో పనిచేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎక్కువ మందిని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కు బదిలీ చేశారు. వాళ్లంతా తిరిగి బెజవాడ వైపు చూస్తు న్నారు. ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి పోలీసు శాఖలో ఈ చర్చ జోరుగా సాగుతోం ది. ఎన్నికల ఫలితాలు వెలు వడి తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన బదిలీలు జరగడం సాధారణం. ఈసారి మాత్రం ఎన్నికల ఫలితాల రాకుండానే పోలీసు శాఖలో ఈ చర్చ మొదలవ్వడం గమనార్హం. సర్వీసును దాదాపును పూర్తి చేసుకున్న కొందరు ఉద్యోగు లు మాత్రం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *