మహారాష్ట్రలో కరుడుగట్టిన నక్సల్‌ జంట లొంగుబాటు


నాగ్‌పూర్‌, ఏప్రిల్‌ 25 : కరుడుగట్టిన నక్సల్‌ జంట గడ్చిరోలిలో పోలీసుల ఎదుట లొంగిపోయింది. దీపక్‌ అలియాస్‌ మంగ్లూ బోగామి (30), అతని భార్య మోతి అలియాస్‌ రాధా మజ్జీ (28) లొంగిపోయారని పోలీసులు తెలిపారు. వారిద్దరి తలపై చెరొక రూ.9.25 లక్షల నగదు బహుమతి ఉందని పేర్కొన్నారు. 2012 జూన్‌లో జగర్‌గుండా దళంలో బోగామి చేరాడని, 14 పోలీసు-నక్సల్స్‌ ఎన్‌కౌంటర్లు, 12 హత్యలు, ఇతర నేరాల్లో అతని హస్తం ఉందని తెలిపారు. అతని భార్య మోతి 2004లో భమ్రాగఢ్‌ దళంలో చేరిందని, ఆమె కూడా 15 ఎన్‌కౌంటర్లు, రెండు హత్యల్లో పాల్గొందని పోలీసులు వెల్లడించారు. మహిళలు, బాలికలపై నక్సలైట్ల అరాచకాలు పెరిగిపోయాయని, బాలికలను బలవంతంగా దళాల్లోకి నెడుతున్నారని దీపక్‌, మోతి తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని నక్సలైట్లు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని, అందువల్లే తాము జనజీవన స్రవంతిలో చేరామని వెల్లడించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *