మాజీ బ్యాంకు ఉద్యోగి అరెస్టు


  • బినామీ డ్వాక్రాల పేరుతో బ్యాంకుకు 1.20 కోట్లు టోపీ
హిందూపురం, మే 4: డ్వాక్రా సంఘాల పేరుతో కోటి రూపాయలకుపైగా నిధులను ఓ బ్యాంకు ఉద్యోగి స్వాహా చేశాడు. బ్యాంకు అంతర్గత విచారణలో విషయం రుజువు కావడంతో ఆయనను తీసేశారు. తాజాగా సదరు ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. హిందూపురం సిండికేట్‌ బ్యాంకులో 2014లో బాబా అక్బర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో ఆయన బినామీ స్వయం సహాయక సంఘాలను సృష్టించారు. వీటికితోడు కొన్ని బినామీ ఖాతాలను బ్యాంకులో తెరిచారు. అలా మొత్తం 23 ఖాతాల్లోకి రూ.1.20 కోట్ల నిధులను మళ్లించాడు. మహిళా సంఘాలకు రుణాల చెల్లింపు, రికవరీ గందరగోళంగా ఉండడంతో బ్యాంకు అంతర్గత విజిలెన్స్‌ బృందం విచారణ చేపట్టింది.
 
బ్యాంకులోని డబ్బు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు అప్పట్లో హిందూపురంలోని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాబాఅక్బర్‌పై కేసు నమోదు అయ్యింది. బ్యాంకు అధికారులు ఆయన్ను సస్పెండ్‌ చేశారు. తరువాత ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ కేసుపై బ్యాంక్‌ ఉన్నతాధికారులు ఒత్తిళ్లు చేయడంతో ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హిందూపురం పోలీసులు సీఐ నేతృత్వంలో ఓ బృందాన్ని నియమించారు. ఎట్టకేలకు శనివారం ఉదయం బ్యాంకు మాజీ అసిస్టెంట్‌ మేనేజర్‌ బాబా అక్బర్‌ను హిందూపురం ఆర్టీసీ బస్టాండు వద్ద అరె్‌స్టచేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *