మాజీ ముఖ్యమంత్రి ఎన్నికల కార్యాలయాన్ని పేల్చేసిన మావోయిస్టులు


రాంచీ: జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోమారు తెగబడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి అర్జున్ ముండా ఎన్నికల కార్యాలయాన్ని కాల్చివేశారు. ఈ తెల్లవారుజామున సెరైకెలా జిల్లాలోని ఖర్సావన్ పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన మావోయిస్టు గెరిల్లా దళ సభ్యులు అందులో నిద్రిస్తున్న నలుగురు డ్రైవర్లను బయటకు పంపి పేలుడు పదార్థాలు పెట్టారు. అనంతరం కార్యాలయాన్ని పేల్చేశారు. దీంతో భవనంలోని చాలా భాగం ధ్వంసమైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. కాగా, గత నెల 26న పలామౌ జిల్లాలోని బీజేపీ కార్యాలయాన్ని కూడా మావోలు పేల్చివేశారు. ఈ నెల 6న ఖుంతి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *