మాతో చర్చకు సిద్ధమా? మోదీకి రాహుల్ సవాల్


మధ్యప్రదేశ్ : తాను తీవ్రంగా కష్టపడతానని, కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోతానన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. అవినీతి, పెద్దనోట్ల రద్దు, రైతుల సమస్యలపై ముందు తనతో చర్చకు రావాలని రాహుల్ సవాల్ విసిరారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనపై ప్రధాని మోదీ వ్యక్తిగత ద్వేషం పెంచుకున్నారని ఆరోపించారు. ఈ దేశపు మట్టినిండా ప్రేమ గుణం ఉంటుందని, కానీ మోదీ మాత్రం నిలువెల్లా ద్వేషాన్ని పెంచుకున్నారని అన్నారు. చాలా మీటింగుల్లో చాలా ప్రేమతో మోదీని పలకరించానని, కానీ ఆయన మారుకూడా మాట్లాడలేదన్నారు.
 
దేశాన్ని ఎలా నడపకూడదో మోదీ తనకు చూపిస్తున్నారని, ఎవరి సలహాలు, సూచనలు, మొరలు వినకుండా ప్రభుత్వాన్ని నడిపితే దేశంలో పరిపాలన సరిగ్గా నడవదని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల క్రితం మోదీని ఎవ్వరూ ఓడించలేరని బీరాలు పలికారని ఎద్దేవా చేశారు. కానీ తాము పార్లమెంట్‌లో, అలాగే కార్యక్షేత్రంలో పోరాడిన విధానాన్ని చూసి మోదీకి ప్రస్తుతం భయం పట్టుకుందని, ప్రస్తుతం మాత్రం తిరిగి మోదీ ప్రధాని అవుతారని ఏ ఒక్కరూ ఘంటాపథంగా చెప్పలేకపోతున్నారని రాహుల్ అన్నారు. ప్రధానిగా మోదీ తిరిగి ఎన్నికవుతారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ… దాన్ని ప్రజలే నిర్ణయిస్తారని, ప్రజల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *