మాయ.. మొసలి కన్నీరు వద్దు


  • కాంగ్రెస్‌కు మద్దతు విరమించుకోండి: మోదీ
లఖ్‌నవూ, మే 12: రాజస్థాన్‌లోని అల్వార్‌లో దళిత యువతి సామూహిక అత్యాచార ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. ‘‘అల్వార్‌ ఘటనపై మీరు(మాయావతి) నిజంగానే విచారం వ్యక్తం చేస్తే.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇంకా ఎందుకు మద్దతు ఇస్తున్నారు? మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు రాజస్థాన్‌ గవర్నర్‌కు లేఖ రాయండి’’ అని డిమాండ్‌ చేశారు. మోదీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మాయావతి విమర్శించారు. దళితులపై గతంలో జరిగిన ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *