మా నివాస కార్యాలయాల్లో మహిళా సిబ్బంది వద్దు!


  • సీజేకు పలువురు జడ్జీల అర్జీ?…
  • జాతీయ పత్రికలో కథనం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: తమ నివాస కార్యాలయాల్లో మహిళా సిబ్బందిని నియమించవద్దంటూ పలువురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు సీజేకి అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. ఓ జాతీయపత్రికలో వెలువడ్డ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం తేనీటి విరామసమయంలో ఇష్టాగోష్టిగా కలిసిన జడ్జీలు…ఈ విషయమై సీజే రంజన్‌ గొగోయ్‌ను అభ్యర్థించారు. నివాస-కార్యాలయాల్లో పురుషులతో సమానంగా మహిళా ఉద్యోగులు కూడా రాత్రి పొద్దుపోయేదాకా పనిచేస్తూంటారని. సీజేకు ఎదురైన పరిస్థితిలాంటిది తలెత్తకుండా చూసుకోవాలంటే తమ ఇళ్ల వద్ద వారిని నియమించడం మంచిది కాదని వారు పేర్కొన్నట్లు ఆ పత్రిక రాసింది. అయితే సుప్రీం సిబ్బందిలో 60 శాతం మంది మహిళా సిబ్బందే ఉన్నారని, జడ్జీల వినతిని సమ్మతించడం సాధ్యం కాదని సీజే అన్నట్లు తెలిసింది. ఈ అంశంపై చర్చ జరగాలని ఆయన వారితో అన్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *