మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ ఇండియాగా అక్షరరెడ్డి


  • త్వరలో ఇంటర్నేషనల్‌ పోటీలకు తెలుగమ్మాయి
మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ ఇండియా-2019 అందాల పోటీల్లో తెలుగమ్మాయి అక్షర రెడ్డి విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి 240 మందికిపైగా అందాలతారలు పోటీపడగా, కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో జరిగిన ఫైనల్స్‌లో అక్షర కిరీటాన్ని దక్కించుకున్నారు. దీంతో వచ్చే అక్టోబర్‌లో దుబాయ్‌లో జరుగనున్న మిస్‌ సూపర్‌గ్లోబ్‌ ఇంటర్నేషనల్‌ పోటీలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ 45 దేశాలకు చెందిన అందాలభామలతో అక్షర పోటీపడతారు. అక్షరరెడ్డిది చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం. సుధాకర్‌, గౌరి తల్లిదండ్రులు. 2011లో మిస్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని గెల్చుకున్నారు.
 
2016లో మిస్‌ అమరావతి పోటీలకు న్యాయనిర్ణేతగానూ వ్యవహరించారు. కాగా, శనివారం చెన్నై వచ్చిన ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘భారతదేశం తరఫున అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొనాలన్నది నా కల. మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ ద్వారా అది నెరవేరనుండడం సంతోషంగా ఉంది. ఇంటర్నేషనల్‌ మోడల్స్‌తో పోటీ తీవ్రంగానే ఉంటుంది. ఒక్కో దేశం నుంచి ఒక్కో విజేత వస్తున్నారు. అయినా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.
-ఆంధ్రజ్యోతి, చెన్నై

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *