మీ ర్యాలీల ఖర్చులను వెల్లడించండి : రాజ్ థాకరేకు ఈసీ ఆదేశం



న్యూఢిల్లీ : మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేకి ఈసీ ఝలక్ ఇచ్చింది. ఎన్నికల సందర్భంగా థాకరే నిర్వహించిన ర్యాలీల ఖర్చులను వెల్లడించాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఏ ఒక్క అభ్యర్థినీ బరిలోకి దింపక పోయినా థాకరే దాదాపు డజన్‌కు పైగా ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆయన ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పై విరుచుకుపడ్డారు. వీరికి ప్రజలెవ్వరూ ఓటు వేయవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్‌ను సునీల్ అరోరా ప్రకటించిన వారం తర్వాత తమ పార్టీ తరపున ఎవరూ పోటీ చేయట్లేదని రాజ్ థాకరే ప్రకటించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *