ముందు పాత హామీలను నెరవేర్చండి… తర్వాత కొత్తవి :ఆప్


న్యూఢిల్లీ : ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రధాని మోదీకి ఐదు ప్రశ్నలతో కూడిన లేఖాస్త్రాన్ని సంధించింది. సరిగ్గా రాంలీలా మైదానంలో మోదీ తలపెట్టిన బహిరంగ సభ కంటే కొద్ది గంటల ముందే ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు గోపాల్ రాయ్ ఈ ప్రశ్నలను సంధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తి హోదాను కల్పిస్తామని 2014 లో హామీ ఇచ్చారని, ఐదేళ్లు గడచినా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
 
ఢిల్లీ పరిధిలోని ఏడు పార్లమెంట్ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులనే ప్రజలు గెలిపించినా, వారిని ఎందుకు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఆప్ నేత ప్రశ్నించారు. వ్యాపారులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్న పన్నుల విషయంలో ఎందుకు ఆర్డినెన్స్‌ను జారీ చేసి సవరించరని మూడో ప్రశ్నను సంధించారు. ఇక నాలుగో ప్రశ్నగా ఢిల్లీ ప్రజలు 1.5 లక్షల కోట్లను పన్నుల రూపంలో చెల్లిస్తుంటే వారికి మాత్రం కేవలం 325 కోట్ల రూపాయలను మాత్రమే ఎందుకు పొందుతున్నారో చెప్పాలని ఆ లేఖలో ప్రశ్నించారు. ఇక ఐదో ప్రశ్నగా ఢిల్లీకి ప్రత్యేకమైన మేనిఫెస్టోను ఎందుకు విడుదల చేయడం లేదని మోదీని ప్రశ్నించారు.
 
కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తన ఓటమిని ఒప్పుకుందని, 2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఇదే విషయాన్ని వారి శ్రేణులకూ ఉద్బోధ చేస్తున్నారని గోపాల్ రాయ్ విమర్శించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *