ముగిసిన ఆరో విడత పోలింగ్… 59.70 శాతం నమోదు


న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ఆరవ విడత పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి ఓవరాల్‌గా 59.70 శాతం నమోదైంది. పశ్చిమబెంగాల్‌లో ఓటర్లు పెద్దఎత్తున తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఇక్కడ 80.13 శాతం పోలింగ్ నమోదైంది.
 
ఢిల్లీలో 55.44, హర్యానాలో 62.14, ఉత్తరప్రదేశ్‌లో 50.82, బీహార్‌లో 55.04, జార్ఖండ్‌లో 64.46, మధ్యప్రదేశ్‌లో60.12 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో నిలుచున్న వారందరికీ ఓటు వినియోగించుకునే అవకాశం ఉన్నందున ఓవరాల్ పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *