ముగిసిన ఆరో విడుత పోలింగ్


ఢిల్లీ: ఆరో విడుత పోలింగ్ పశ్చిమబెంగాల్ మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు క్యూలైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఆదివారం యూపీ 14, హరియాణా 10. మధ్యప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ 8 చొప్పున, ఢిల్లీ 7, జార్ఖండ్‌లో 4 స్థానాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 4 గంటల వరకు 50.77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బిహార్‌లో 44.40, హరియణాలో 51.86, మధ్యప్రదేశ్‌లో 52.78, యూపీలో 43.40, పశ్చిమబెంగాల్‌లో 70.51, జార్ఖండ్‌లో 58.08, ఢిల్లీలో 45.24 శాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు.
 
ఇప్పటివరకు ఐదు దశల్లో మొత్తం 424 స్థానాల్లో పోలింగ్‌ ముగియగా.. 19న అఖరి దశలో మరో 59 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఆరో దశలో ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గంలో రెండు జాతీయ పార్టీలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు షీలా దీక్షిత్‌, మనోజ్‌ తివారీ హోరాహోరీగా తల పడుతుండగా.. భోపాల్‌లో.. దిగ్విజయ్‌ సింగ్‌, ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. వీరితో పాటు మేనకా గాంధీ, అఖిలేశ్‌, జ్యోతిరాదిత్య వంటి ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *