ముర్షీదాబాద్‌లో చెలరేగిన హింస: ముగ్గురికి గాయాలు


ముర్షీదాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో పోలింగ్ సందర్భంగా హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోలింగ్ కేంద్ర వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివస్తున్నారు. ముర్షీదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడి 7వ నంబర్ పోలింగ్ సెంటర్లో హింసాయుత ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. ఈ స్థానంలో సీపీఎం తరపున బదరుద్దోజా ఖాన్, టీఎంసీ నుంచి అబూతహెర్, కాంగ్రెస్ అభ్యర్థిగా అబూహెనా, బీజేపీ నుంచి హుమాయూ కబీర్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ కూడా పోటీచేస్తూ, మిజానుల్ హక్‌ను బరిలో నిలిపింది. పలువురు స్వతంత్రులు కూడా ఈ సీటుపై కన్నేశారు. 2014 ఎన్నికల్లో ఈ సీటును సీపీఎం దక్కించుకుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *