ములాయంకు ప్రధాని అయ్యే స్థాయి ఉంది


  • ఆ గౌరవం దక్కితే బాగానే ఉంటుంది
  • కానీ ఆయన రేసులో లేరు: అఖిలేశ్‌
లఖ్‌నవూ,మే 2: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌కు ప్రధాని అయ్యేంత స్థాయి ఉందని ఆయన కుమారుడు, ప్రస్తుత పార్టీ సారథి అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ‘‘నేతాజీ (ములాయం)కి ఆ గౌరవం దక్కితే బాగానే ఉంటుంది. కానీ బహుశా ఆయన ఈ రేసులో లేరన్నది నా అభిప్రాయం’’ అని అఖిలేశ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రక్షణమంత్రిగా పనిచేసిన ములాయం….. గతంలో ప్రధాని పీఠం మీద ఆశలు పెంచుకున్నారు. కానీ పరిస్థితులు ఆయనకు అనుకూలించలేదు. ప్రస్తుతం ఆరోగ్యం సహకరించకపోయినా మెయిన్‌పురి నుంచి పోటీచేస్తున్న ఆయన… ఇవే తనకు చివరి ఎన్నికలని ప్రకటించారు. అటు అఖిలేశ్‌ కూడా ప్రధాని పదవి వరకూ వస్తే తాను మాయావతికి మద్దతిస్తానని సంకేతాలిచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *