మెట్రో స్టేషన్ వద్ద సిఆర్పీఎఫ్ దుస్తుల్లో ఉన్న అనుమానితుని అరెస్ట్


న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) ఈరోజు ఢిల్లీలోని చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద ఒక అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకుంది. ఆ యువకుడు సీఆర్పీఎఫ్ దుస్తులు ధరించాడు. పట్టుబడిన యువకుడు తన పేరు నదీమ్‌ఖాన్ అని, షామ్లీలో ఉంటున్నానని చెప్పాడు. అలాగే తాను సీఆర్పీఎఫ్‌లో శిక్షణ పొందుతున్నానని, శ్రీనగర్‌లో తన శిక్షణ కొనసాగుతున్నదని తెలిపాడు. తన తల్లి అంతిమ సంస్కారాల కోసం షామ్లీ వచ్చానని చెప్పాడు. అయితే అధికారుల విచారణలో ఆ యువకుడు చెప్పినది తప్పని, అతని తల్లిదండ్రులు ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడైంది. దీనికితోడు ఆ యువకుడు శ్రీనగర్‌లో శిక్షణ పొందడం లేదని కూడా తేలింది. కాగా అతని దగ్గర రెండు ఆధార్ కార్డులు లభ్యమయ్యాయి. దీంతో ఢిల్లీ పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల శ్రీలంకలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్న తరువాత భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *