మెుగలిచర్ల దత్తాత్రేయస్వామి అర్ధమండలదీక్షలు


మెుగలిచెర్ల (ప్రకాశం జిల్లా): మహిమాన్విత యోగీశ్వరునిగా, దత్తావధూతగా భక్తుల పూజలందుకుంటున్న మెుగలిచెర్ల దత్తాత్రేయస్వామి వారి అర్థమాలధారణ దీక్షలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం 21వ తేదీ ఆదివారం కూడా కొనసాగనుంది. దీక్ష తీసుకునే భక్తులకు స్వామివారి సమాధి వద్ద పూజ చేసిన దీక్షామాలలను అందజేస్తామని, స్వామివారి మందిరంలోనే ఈ దీక్ష ఇస్తామని శ్రీదత్తాత్రేయస్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త పవని నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. దీక్ష విరమణ మే నెల 10, 11 తేదీల్లో ఉంటుంది. భక్తులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీ దత్తాత్రేయ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోనులోనూ (సెల్: 9440266380, 9441916557) సంప్రదించవచ్చని తెలియజేశారు.
 
 
(ప్రకాశం జిల్లాలో ఉన్న మొగలిచర్ల గ్రామానికి రైలుమార్గంలో అయితే ముందుగా సింగరాయకొండ చేరుకుని అక్కడి నుంచి కందుకూరు మీదుగా వెళ్ళవచ్చు. బస్సులో అయితే నేరుగా కందుకూరు వెళ్ళి అక్కడి నుంచి మొగలిచర్లకు వెళ్ళవచ్చు)

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *