’మేరా అమేథీ పరివార్‘ అంటూ ప్రజలకు లేఖ రాసిన రాహుల్


లక్నో : కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గ ప్రజలకు ఓ లేఖ రాశారు. ‘మేరా అమేథీ పరివార్’ అంటూ సంబోధిస్తూ రాసిన ఈ లేఖలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతానని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రజలకు హామీ ఇచ్చారు. బీజేపీ అబద్ధాల కర్మాగారమని, ఓటర్లకు ఓ ప్రవాహంలా డబ్బును పంచిపెడుతూ మభ్యపెడుతున్నారని లేఖలో విమర్శించారు. నిజాయితీ, సమగ్ర అనే అంశాలే అమేథీ నియోజకవర్గ బలాలని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు.
 
మరోవైపు తమ అభ్యర్థి రాహుల్ గాంధీ కనిపించడం లేదంటూ అమేథీలో పోస్టర్లు వెలిశాయి. దేశం మొత్తం ప్రచార బాధ్యతల్లో రాహుల్ మునిగి తేలడంతో తన నియోజకవర్గానికి అధిక సమయాన్ని కేటాయించలేదు. ఆయన తరపున ఆయన చెల్లెలు, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆ బాధ్యతలను చేపట్టారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *