మే 14 డౌటే!


  • దుర్గా ఫ్లై ఓవర్‌ ‘వై’ పిల్లర్స్‌ కష్టాలు!
  • సోమాకు జరిమానా విధించే అవకాశం
  • పిల్లర్స్‌ నిర్మాణంలో అంతులేని సాగదీత
కనకదుర్గా ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి చివరి డెడ్‌లైన్‌ కూడా సవరిం చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడు తోంది. ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయ న్నదానిపై కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ కే అంచనాలు లేవని తెలుస్తోంది! పట్టుమని ఆరు ‘వై’ పిల్లర్ల పనులను ఆరు నెలలుగా సాగదీ స్తూనే ఉంది. నెల రోజుల పాటు ఎన్నికల మూడ్‌లో ఉండటంతో అనుకున్నంత వేగంగా క్షేత్ర స్థాయిలో పనులైతే ముందుకు కదల్లేదు. ఇప్పుడు గడువుకు సరిగ్గా 24 రోజుల మాత్రమే ఉంది. ఈలోగా వై పిల్లర్స్‌ పను లు పూర్తి కావటం దాదాపుగా అసంభ వమేనని తెలుస్తోంది.
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): దుర్గా ఫ్లై ఓవర్‌.. ఇక ఇదే తుది డెడ్‌లైన్‌ అను కున్నా.. ఈ‘సారీ’ తప్పటం లేదు! కాంట్రాక్టు సంస్థ ‘సోమా’కు నిర్దేశించిన గడువు తన్నుకు వస్తున్నా.. కీలకమైన పనులన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. దుర్గా ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తి కావటానికి అతి ముఖ్యమైన ‘వై’ పిల్లర్స్‌ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. దీనికితోడు కాంట్రాక్టు సంస్థ చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో తమ ఇతర ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయటంతో అధికారులకు ఇప్పుడు కొత్త భయం వచ్చి పడింది. ఇక్కడ కూడా పనులు నిలుపుదల చేస్తే ఏమిటన్న భయం ఇప్పుడు అధికారులను వేధిస్తోంది. దీంతో కాంట్రాక్టు సంస్థను బుజ్జగింపులు చేస్తోంది. అరకొర పనులు చూస్తుంటే వచ్చే జూన్‌కు కాదు కదా! జూలై నాటికైనా ఈ ఫ్లై ఓవర్‌ పూర్తవుతుందా అన్నది సందేహంగా ఉంది. దుర్గా ఫ్లె ఓవర్‌లో మేజర్‌ పనులు వై పిల్లర్స్‌ నిర్మాణమే కాబట్టి ఇవి త్వరగా పూర్తయితే ఒక పెద్ద గండం గట్టిక్కినట్టే!
 
ఇంద్రకీలాద్రి బాటిల్‌ నెక్‌ను కవర్‌ చేసే ప్రాంతంలో హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి కృష్ణానది మీదుగా మోడల్‌ గెస్ట్‌హౌస్‌కు వచ్చి అక్కడి నుంచి దర్గా మీదుగా కృష్ణా కెనాల్‌ మీదుగా పనులు జరుగుతున్నాయి. ఇందులో హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి మొత్తం 6 ‘వై’ పిల్లర్స్‌ నిర్మాణ పనులు చేపడుతోంది. దాదాపుగా 2 ‘వై’ పిల్లర్స్‌ పనులు పూర్తయ్యాయి. హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి మొదటి రెండు ‘వై’ పిల్లర్లు! ఇవి ఆర్నెల్ల క్రితం మొదలు పెట్టిన పనులు! మూడు, నాలుగు నెలలకాలంలో మరో 4 ‘వై’ పిల్లర్ల పనులు తలపెట్టారు. ఇప్పటికీ ఇవి పూర్తి కాలేదు.
 
ఎక్కువ పిల్లర్‌ నిర్మాణాలు చేపట్టారా?
వై పిల్లర్‌ నిర్మాణాల విషయంలో అవస రానికి మించి ఎక్కువ ఏర్పాటు చేయటానికి కాంట్రాక్టు సంస్థ ఆసక్తి చూపిందన్న విమర్శలు వస్తున్నాయి. వై పిల్లర్స్‌కు సంబంధించిన డిజైన్లపై కాంట్రాక్టు సంస్థకు పూర్తి స్వేచ్ఛ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కారణం చేతనే ఎక్కువ వై పిల్లర్స్‌కు కాంట్రాక్టు సంస్థ మొగ్గు చూపినట్టు తెలు స్తోంది. గుడి మలుపు దగ్గర పార్‌ బ్రిడ్జికి అవ తల కృష్ణానది మీదుగా ఫ్లై ఓవర్‌ను తీసుకు రా వాల్సి ఉండటం, కింద హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ మం చినీటి పైపుల దగ్గర భూగర్భ పిల్లర్లను తప్పించటానికి, పొడవాటి స్పాన్‌లను ఏర్పాటు చేయటానికి వీలుగా వై పిల్లర్స్‌ను డిజైన్‌లో కాంట్రాక్టు సంస్థ చేర్చింది. అవసరం ఉన్నచోట అయితే తప్పులేదు. కానీ, మోడల్‌ గెస్ట్‌హౌస్‌ దగ్గర కూడా ప్రతిపాదించారు. ఇక్కడ వై పిల్లర్స్‌ కంటే సాధారణ పిల్లర్స్‌ వేసి ఉంటే ఈ పాటికి పనులు పురోగతిలో ఉండేవి. అలాగే కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ ప్రాంతంలో కూడా మరో రెండు ‘వై’ పిల్లర్స్‌ నిర్మాణాలు చేపట్టారు. వీటి లో ఒకటి తగ్గించి ఉన్నా ఈ పాటికి పనులు పురోగతిలో ఉన్నాయి. మొ దటిగా నిర్మాణం తలపెట్టిన వై పిల్లర్స్‌ పనులే ఆరునెలల సమయం పడితే.. వీటికి ఇంకెంత సమయం పడుతుందో అర్థం కావటం లేదు. కాంట్రాక్టు సంస్థకు ఇచ్చిన డెడ్‌లైన్‌ మే 14 నాటికి పూర్తి చేయకపోతే కేంద్ర ప్రభుత్వం సోమాకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
అక్కడ పనులు నిలుపుదల..
కాంట్రాక్టు సంస్థ పనులు జాప్యం చేస్తుంటే అధికారులు ఇక్కడ భయపడిపోతున్నారు. కాంట్రాక్టు సంస్థను బతిమాలుతూ, నచ్చచెప్పి పనులు చేయిస్తున్నారు. అయినా పురోగతిలో లేవు. బెంగళూరు, చెన్నై తదితర ప్రాం తాలలో సోమా తలపెట్టిన ప్రాజెక్టు పనులన్నింటినీ నిలిపే సినట్టుగా వెలుగులోకి రావటంతో అధికారులు భయపడి పోతున్నారు. ఇక్కడ కూడా తనకు నష్టం జరిగిందని, కేంద్రం, రాష్ట్రం నుంచి తనకు ఇబ్బందులు ఉన్నాయని ఆర్బిట్రేషన్‌ కు వెళితే మొత్తంగా పనులు నిలుపుదల చేసే ప్రమా దం ఉందని భయపడుతున్నారు. దీంతో సోమా సంస్థ మీద ఒత్తిడి తీసుకురాలేక పోతున్నారని తెలుస్తోంది.
 
కెనాల్‌ వద్ద.. బ్రిడ్జిపై సాగుతున్న పనులు
కృష్ణా కెనాల్‌పై జరుగుతున్న వంతెన పనులు కూడా సాగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి పిల్లర్‌ నిర్మాణాలు పురోగతిలో ఉన్నా.. గడ్డర్ల ఏర్పాటు పనులు ఇంకా మొదలే కాలేదు. ఈ పనుల తాత్సారం వల్ల దుర్గగుడి మలుపు నుంచి దుర్గా ఫ్లై ఓవర్‌ పనులు అసంపూర్ణంగా కనిపిస్తున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *