మైత్రి ద్వారానే వెనుకబాటు: దేవేగౌడ సంచలన ప్రకటన


బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో మైత్రి పార్టీలు జేడీఎస్-కాంగ్రెస్‌ అగ్రనేతలు ఒక్కటైనా కార్యకర్తలలో బేధాభిప్రాయాలు కొనసాగాయని ఉన్నత విద్యాశాఖ మంత్రి, మైసూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి జి.టి.దేవేగౌడ సంచలనమైన ప్రకటన చేశారు. మైసూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇరు పార్టీలు సమైక్యంగా పనిచేయాల్సి ఉండేదన్నారు. పోటాపోటీ అనిపించాల్సిన ఎన్నికల్లో పలు చోట్ల మైత్రి ద్వారానే వెనుకబడినట్లు అయ్యిందన్నారు.
 
కాంగ్రెస్‌ను ఇష్టపడని జేడీఎస్‌, జేడీఎ్‌సను అంగీకరించని కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీకి ఓట్లు వేశారని మనసులో మాట వెల్లడించారు. అయితే 2014తో పోలిస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభావం ఏమాత్రం లేదని, ప్రత్యేకించి రాష్ట్రంలో ఆయన పర్యటన ద్వారా ఎటువంటి ప్రత్యేకమైన మార్పులు లేవన్నారు. ప్రధాని దేశాభివృద్ధి పట్ల ఆలోచించాల్సి ఉండేదన్నారు. కేవలం కర్ణాటకకు వచ్చిన ప్రతిసారి ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆయనను ప్రజలు విశ్వాసంలోకి తీసుకోలేదన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *