మొసలి కన్నీరు, నీచ రాజకీయాలు: మోదీపై మాయ ఫైర్


లక్నో: ఆల్వార్ సామూహిక అత్యాచారం ఘటనపై ప్రధాని మోదీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, మొసలి కన్నీరు కారుస్తారని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. ఆల్వార్ ఘటనలో నిందితులపై చర్యలకు తమ పార్టీ పట్టుదలగా ఉందని చెప్పారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై ‘అవార్డ్ వాసపీ గ్యాంగ్’ ఎందుకు స్పందించడం లేదంటూ యూపీలోని కుషీనగర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ నిలదీశారు. దళిత ఆడకూతురు అత్యాచారానికి గురైతే బెహన్‌జీ (మాయావతి) ఎందుకు రాజస్థాన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం లేదంటూ నిలదీశారు. మాయవతి కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారని విమర్శించారు.
 
మోదీ వ్యాఖ్యలపై మాయావతి ఒక ప్రకటనలో సూటిగా స్పందించారు. ‘ఆల్వార్ ఘటనను అడ్డుపెట్టుకుని మోదీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ కేసులో రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుంటే బీఎస్‌పీ రాజకీయంగా తగిన నిర్ణయం తీసుకుంటుంది. మరి మోదీ గతలో జరిగిన ఘటనలపై ఎందుకు బాధ్యత తీసుకోరు? ఉనా ఘటన, రోహిత్ వేముల కేసు, దళితులపై అత్యాచారాలకు సంబంధించిన కేసులపై ఆయనకు బాధ్యత లేదా? ఆయన ఎందుకు రాజీనామా చేయరు?’ అని మోదీపై మాయావతి నిప్పులు చెరిగారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *