మోదీకి కౌంటర్ ఇచ్చిన సీఎం కుమారస్వామి


బెంగళూరు: తన దేశభక్తిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి ఖండించారు. తనకు దేశభక్తి లేదని మోదీ అంటున్నారని.. ఆయన నుంచి దేశభక్తి నేర్చుకోవలసిన అవసరం తనకు లేదన్నారు. తన తండ్రి దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో కశ్మీర్‌లో ఒక్క పేలుడు కూడా జరగలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా కుమారస్వామి గుర్తు చేశారు. అదీ తన వారసత్వమన్నారు. కాబట్టి తనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదని.. ఆ హక్కు మోదీకి లేదని విమర్శించారు.
 
తినడానికి తిండి లేని వాళ్లే సైన్యంలో చేరుతున్నారంటూ కుమార స్వామి చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలపై మోదీ స్పందించిన విషయం తెలిసిందే. శుక్రవారం కొప్పల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ఎనలేని త్యాగాలు చేస్తున్న సైనికుల దేశభక్తిపై కుమారస్వామి వ్యాఖ్యలు నిజంగా బాధకరమని మోదీ వ్యాఖ్యానించారు. ఆ స్థాయి నాయకుడి నుంచి ఆశించేది ఇలాంటి వ్యాఖ్యలేనా అని ప్రశ్నించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *