మోదీకి సంస్కారం లేదు. అందుకే చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయారు: ఖర్గే


న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ‘నంబర్ వన్ అవినీతిపరుడు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యఖ్యలపై లోక్‌సభ కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి అసలు సంస్కారమే లేదని, అందుకే చిన్న వయసులోనే ఇళ్లు వదిలిపారిపోయారని తీవ్రంగా విమర్శించారు.
 
‘‘ఆయన(నరేంద్రమోదీ)కు సంస్కారమే లేదు. అందుకే చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయారు. ప్రధానమంత్రి స్థాయిని మోదీ ఎప్పుడో తగ్గించారు. ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తి గురించి మోదీ చాలా తగ్గించి మాట్లాడుతున్నారు. ఆయనకు దేశభక్తి లేదు, హృదయమే లేదు. ఆయనకు ఎన్నికల్లో లబ్ది పొందేందుకే మోదీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో తెలియక పోవడం బాధాకరం. దేశానికి ఆయన చేసిన పని ఒక్కటీ లేదు’’ అని ఖర్గే విమర్శించారు.
 
మే 4న ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘‘మీ నాన్ని మిస్టర్ క్లీన్‌గా దేశ రాజకీయాల్లో వచ్చారు. కానీ నంబర్ వన్ అవినీతి పరుడిగా జీవితం ముగించారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *