మోదీకి సవాల్ విసురుతున్న నవీన్ పట్నాయక్ ప్రచార వ్యూహం!


న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలు ఐదో దశకు చేరుకుంటున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు తమ శక్తిమేర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడికక్కడ మెగా రోడ్ షోలు, ప్రత్యేక ఇంటర్వ్యూలతో తమదే విజయం అంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. అయితే అందరికంటే కొంత భిన్నంగా… ప్రజలకు చేరువయ్యేందుకు తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్… రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ను అధిగమించేందుకు అందివచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ ఆయన వదులుకోవడం లేదు. ఇటీవల ఓ ఫిట్‌నెట్ వీడియో కూడా విడుదల చేశారాయన! జాగింగ్, బరువులు పట్టడం, లిఫ్ట్‌-అప్‌లు, సిట్-అప్‌లు, స్టేషనరీ సైకిల్ తొక్కడం సహా.. ఈ పెద్దాయన పలు వర్కవుట్‌లు చేస్తున్నట్టు ఈ వీడియోలో చూడొచ్చు. తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టడంతో పాటు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఆయన ఈ వీడియో రిలీజ్ చేసినట్టు కనిపిస్తోంది.
 
అంతేకాదు.. పట్నాయక్, ఆయన పార్టీ నేతలు ఇప్పుడు టెక్నాలజీని సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. పట్నాయక్ ప్రచారాన్ని మరింత ఆకర్షణీయంగా, విస్తృతంగా చేసేందుకు బీజేడీ హోలోగ్రామ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఆటోమేటెడ్ వాయిస్ కాల్‌తో పట్నాయక్ మొబైల్ ఫోన్ వినియోగదారులను పేరుపెట్టి పిలవడం, అనంతరం వారికి తన ప్రసంగం వినిపించడం ఆయన ప్రచారంలో మరో ప్రత్యేకత. దీంతోపాటు ప్రత్యేకంగా రూపొందించిన ఓ బస్సులో రోజూ ఆయన రోడ్‌షోలు ఉండేలా బీజేడీ ప్లాన్ చేసింది. ఒకే ప్రయాణంలో పలు ప్రాంతాల్లోని ఓటర్లతో మాట్లాడేలా వ్యూహం అమలు చేస్తోంది. ఇప్పటికే ఆయన వెయ్యి కిలోమీటర్లకు పైగా చుట్టివచ్చినట్టు అంచనా.
 
వీడియో సౌజన్యం: ప్రగతివాది న్యూస్ పబ్లికేషన్ 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *