మోదీజీ.. ఉరికి సిద్ధమేనా? ఖర్గే సవాల్


న్యూఢిల్లీ: ఎన్నికల ముగింపునకు వచ్చిన కొద్దీ రాజకీయ విమర్శలు మరింత పదును తేలుతున్నాయి. సవాళ్లు ప్రతిసవాళ్లతో ప్రత్యర్థి రాజకీయ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు 40 సీట్లకంటే ఎక్కువ రావంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ 40 స్థానాల కంటే ఎక్కువ గెలుచుకుంటే ఢిల్లీలోని విజయ్ చౌరస్థాలో ఉరేసుకుంటావా? అని ప్రధానికి ఆయన సవాలు విసిరారు.
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు 40కి మించి స్థానాలు రావని ఆయన తరుచూ జోస్యం చెబుతున్నారు . 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44 స్థానాలు మాత్రమే వచ్చాయి. దేశ ఎన్నికల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఇంత తక్కువ స్థానాలు గెలుచుకోవడం ఇదే తొలిసారి.
 
కాగా మోదీ వ్యాఖ్యలపై ఖర్గే ఘాటుగా స్పందించారు. ‘‘ఆయన ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ 40 స్థానాలు రావని అంటున్నారు. మీరు ఇదే మాట మీద ఉంటారా? ఒక వేళ కాంగ్రెస్‌ 40 స్థానాలకు పైగా గెలుచుకుంటే ఢిల్లీలోని విజయ్ చౌరస్తాలో ఉరివేసుకుంటారా?’’ అని ఖర్గే సవాలు విసిరారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *