మోదీజీ.. తగలబడిన ఫైళ్లు మిమ్మల్ని కాపాడలేవు: రాహుల్


న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రభుత్వ భవనమైన ‘శాస్త్రి భవన్‌’లో మంగళవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం అనంతరం ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఘాటుగా ట్వీట్ చేశారు. ‘మోదీజీ, తగలబడిపోయిన ఫైళ్లు మిమ్మల్ని కాపాడలేవు. మీ జడ్జిమెంట్ డే త్వరలోనే రాబోతోంది’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
 
న్యాయశాఖ, సమాచార-ప్రసార శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు, రసాయనాలు, పెట్రో కెమికల్స్, మానవ వనురల అభివృద్ధి మంత్రిత్వ శాఖలన్నీ శాస్త్రి భవన్‌లో ఉన్నాయి. ప్రభుత్వ శాఖలకు చెందిన ఫైళ్ల గిడ్డంగి (స్టోర్‌హౌస్) కూడా ఈ భవనంలోనే ఉంది. శాస్త్రి భవన్‌లోని ఆరో అంతస్తులో ఇవాళ మధ్యాహ్నం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. మంటల్ని నిమిషాల్లో ఆర్పేసినట్టు అగ్నిమాపకదళ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరిగినట్టు ఇంతవరకూ సమాచారం లేదు. ప్రమాద కారణం కూడా తెలియాల్సి ఉంది. మధ్యాహ్నం 2.45 గంటలకు స్క్రాప్ మెటీరియల్ (తుక్కు) ఉంచిన చోట అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, ఏడు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసినట్టు ఆ అధికారి వివరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *