మోదీని కొడితే నా చేయి విరుగుతుంది: మమత


కోల్‌కతా: ప్రధాని మోదీకి ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తానంటూ తాను చేస్తున్న వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న బీజేపీ నేతలకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దీటైన జవాబిచ్చారు. ఆయనను (మోదీని) కొడతానని తాను చెప్పలేదని, ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తామనే తాను చెప్పానని బషిర్హాట్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత పేర్కొన్నారు.
 
‘మిమ్మల్ని నేనెందుకు కొడతాను? మిమ్మల్ని కొడితే నా చేయి విరిగిపోతుంది. ఆ పని నేనెందుకు చేయాలి? మీది 56 అంగుళాల ఛాతీ. మిమ్మల్ని నేనెలా కొట్టగలను? మిమ్మల్ని కొట్టాలని కానీ కనీసం ముట్టుకునే ఉద్దేశం కానీ నాకు లేదు’ అని మమత కరాఖండిగా చెప్పారు. పురూలియాలో ఈనెల 7న జరిగిన ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ప్రధానిపై నిప్పులు చెరిగారు. డబ్బు తనకో లెక్కకాదని చెబుతూ, నరేంద్ర మోదీ బెంగాల్ వచ్చి టీఎంసీని టోల్‌బాజ్ (టోల్ కలెక్టర్)గా నిందారోపణలు చేస్తున్నారని తప్పుపట్టారు. ప్రజాస్వామ్యం గొప్పతనం ఏమిటో, ప్రజాస్వామ్యం సత్తా ఏమిటో ప్రధానికి తాను చవిచూపిస్తానని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే మీకు రాముడు గుర్తుకొస్తాడని, రాముడిని ఎన్నికల ఏజెంటుగా చేయడం బీజేపీకి అలవాటని దయ్యపట్టారు. రాముడి పేరు చెప్పుకునే మీరు కనీసం ఒక్క రామాలయమైనా కట్టించారా అని మమత సూటిగా మోదీని ప్రశ్నించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *