మోదీని జలగతో పోల్చిన సిద్ధూ


రాయ్‌పూర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాన్యుల రక్తం పీల్చుకుంటున్నారని కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. కొందరు పెట్టుబడిదారులకు సానుకూలంగా వ్యవహరిస్తూ, పేదల పాలిట జలగలా మారారని దుయ్యబట్టారు.
 
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో సిద్ధూ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి పని డీజిల్‌ను డీ రెగ్యులరైజ్ చేయడమన్నారు. అంతకుముందు పెట్రోలు ధరలు మార్చే అవకాశం ఉండేది కానీ, డీజిల్ ధరలను మార్చడానికి వీలయ్యేది కాదన్నారు. మోదీ డీజిల్‌ను డీ రెగ్యులరైజ్ చేశారన్నారు. కొన్ని వ్యాపార సంస్థలకు మేలు చేకూర్చడానికే ఈ విధంగా చేశారని ఆరోపించారు.
 
డీజిల్, పెట్రోల్‌లపై విపరీతంగా ఎక్సయిజ్ సుంకాలను పెంచారని, దీనివల్ల రైతులు, మధ్య తరగతి ప్రజలు దెబ్బతింటున్నారని అన్నారు. ‘‘మీరు జలగలా మారారు. మీరు సామాన్యుల రక్తం పీల్చుకుంటున్నారు’’ అని మోదీని ఉద్దేశించి సిద్ధూ అన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *