మోదీపై చర్యలు తీసుకోండి : ఈసీకి ఏచూరీ లేఖ



న్యూఢిల్లీ : ప్రధాని మోదీపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఓటర్లను ఆకర్షించడానికి బాలాకోట్ దాడుల వివరాలను ఓ ఆంగ్ల ఛానల్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారని, అందుకు మోదీపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. మిలటరీ దాడుల లాంటి అతి సున్నితమైన అంశాలను మోదీ ఓటర్లను ప్రభావితం చేయడానికి వాడుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయన వ్యాఖ్యలే తెలుపుతున్నాయని, వెంటనే ఆయనపై చర్య తీసుకోవాలని అన్నారు. ఆర్మీ మొత్తం దేశానికి సంబంధించిందని, ఆ పేరు చెప్పి ఓట్లను దండుకోవడం ఏ పార్టీ చేసినా తప్పేనని ఏచూరీ అన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *