మోదీపై పోటీ చేయబోతోంది ప్రియాంక గాంధీ కాదు!


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారనే పుకార్లకు కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది. వారణాసి నుంచి అజయ్ రాయ్‌ను అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో ప్రధానిపై ప్రియాంక పోటీ చేయనున్నారనే ప్రచారానికి తెర పడింది. గత ఎన్నికల్లో దాదాపు మూడు లక్షలకు పైగా ఓట్లతో గెలిచిన మోదీపై ప్రియాంకను బరిలో నిలపడం దుస్సాహసమని కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 
పైగా హిందుత్వ వాదానికి పెద్ద పీట వేసే వారణాసి నియోజకవర్గంలో బీజేపీ రోడ్ల విస్తరణకు పూనుకున్న సందర్భంలో పలు దేవాలయాలు బయటపడ్డాయి. ఈ పరిణామంతో వారణాసిలోని మెజార్టీ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇటీవలే వచ్చిన ప్రియాంక గాంధీ ఏఐసీసీ(యూపీ ఈస్ట్) ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రియాంక సేవలను కేవలం ప్రచారానికే పరిమితం చేయాలని అధిష్టానం భావిస్తోందట.
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *