మోదీ అంటే భయంగా ఉంది : శరద్ పవార్


ముంబై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటే తనకు చాలా భయంగా ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ చెప్పారు. మోదీ మళ్ళీ ఏం చేస్తారోనని తనకు భయంగా ఉందన్నారు. మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం పరిథిలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బారామతి నియోజకవర్గం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
 
‘‘నా వేలు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని మోదీ చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నాకు ఆయన అంటే భయంగా ఉంది, ఎందుకంటే, ఆయన ఏం చేస్తారో ఎవరికీ తెలియదు’’ అని శరద్ పవార్ చెప్పారు.
 
ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బారామతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనవలసి ఉంది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ మాట్లాడుతూ బారామతి మీద దేశమంతటికీ ఎందుకు అంత ఆసక్తి అని ప్రశ్నించారు. యూపీయే ప్రభుత్వం ఏం చేసిందని బీజేపీ అడుగుతోందని, అయితే బీజేపీ తాను అధికారంలో ఉన్న పదేళ్ళలో ఏం చేసిందో చెప్పడం లేదని అన్నారు. ప్రధాని మోదీ మహారాష్ట్రలో ఏడు బహిరంగ సభల్లో మాట్లాడారని, ఆయన మాట్లాడిన అంశం శరద్ పవార్ అని అన్నారు. (తనపైనే మోదీ విమర్శలు గుప్పించారని చెప్పారు).

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *