మోదీ ఇక్కడ ఓటరు అయి ఉంటే, నాకే ఓటేసేవారు…ఆర్జేడీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు


వైశాలీ : బీహార్ రాష్ట్రంలోని వైశాలీ పార్లమెంటు నియోజకవర్గ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అభ్యర్థి రఘువంశ్ ప్రసాద్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైశాలీ ఓటరు అయి ఉంటే, ఆయన కూడా తనకే ఓటేసే వారని మహాకూటమి అభ్యర్థి రఘువంశ్ ప్రసాద్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘కొంతమంది మోదీ…మోదీ అంటున్నారని, కాని మోదీ వైశాలీ ఓటరు అయి ఉంటే, ఆయన కూడా రఘువంశ్ ప్రసాద్ కే ఓటేస్తారని ప్రజలే చెబుతున్నారని ఆర్జేడీ నాయకుడు చెప్పారు. వైశాలీలో ఓటర్లు మహాకూటమి వైపే ఉన్నారని, బీజేపీ, జేడీయూలోని మంచి వారంతా తనకే ఓటేస్తారని రఘువంశ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత కులాల వారికి రిజర్వేషన్ లు కల్పించడం ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం దేశానికి ఎంతో అవసరమని బీజేపీ వైశాలీ అభ్యర్థిని వీణాదేవి అన్నారు. తాను స్థానికురాలినని, ఇక్కడి ప్రజలకు తాను 20 ఏళ్లుగా తెలుసునని వీణాదేవి చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *