మోదీ ఓబీసీ అయితే… అర్‌ఎస్ఎస్ ఆయన్ను ప్రధానిగా చేసేదా?


న్యూఢిల్లీ: ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న ఆరోపణలపై బీఎస్పీ చీప్ మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే ఆయన ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారనీ… మోదీ వాడుతున్న భాషతో ఆయన ఓటమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆమె అన్నారు. ‘‘మళ్లీ ప్రధాని కావాలని మోదీ కలలు కంటున్నారు. కానీ ఆయన కలలు నిజంకాబోవు..’’ అని మాయావతి పేర్కొన్నారు.
 
తాను అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన వాడినంటూ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలపైనా ఆమె స్పందించారు. ‘‘మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు. అందుకే వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియదు. ఆయన ఓబీసీ అయితే మహాకూటమిపై ‘జాతీయవాదం’ పేరిట వ్యాఖ్యలు చేసేవారూ కాదు. ఒకవేళ నిజంగా ఆయన ఓబీసీ అయివుంటే ఆర్ఎస్ఎస్ ఆయన్ను ప్రధానిగా చేసేదా?’’ అని మాయావతి ప్రశ్నించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *