మోదీ పుట్టుకతో బీసీ కాదు: మాయావతి


జలౌన్: ప్రధాని నరేంద్ర మోదీపై బీఎస్‌పీ చీఫ్ మాయావతి మరోసారి విరుచుకుపడ్డారు. పుట్టుకతో మోదీ వెనుకడిన వర్గానికి (బీసీ) చెందిన వ్యక్తి కాదని అన్నారు. యూపీలోని జలౌన్‌లో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మాయావతి మాట్లాడుతూ, మోదీ ఇప్పటికీ తాను సమాజంలో వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తినంటూ ప్రచారం చేసుకుంటున్నారని, అయితే ఆయన పుట్టుకతో బీసీ కాదనే విషయం ప్రతి ఒక్కరి తెలుసునని అన్నారు.
 
గుజరాత్‌లో మోదీ ప్రభుత్వం ఉన్నప్పుడు తన కమ్యూనిటీని వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చుకున్నారని మాయావతి చెప్పారు. ఆయనకు కేవలం బీసీ ఓట్ల మీద మాత్రమే ప్రేమ అని ఎద్దేవా చేశారు. మోదీ నిజంగానే బీసీల సంక్షేమ కోరుకునే వారయితే, బీసీల పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉండేది కాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, ఆ పార్టీ తప్పుడు విధానాలు, విద్వేష రాజకీయాలే ఓటమికి కారణమవుతాయని అన్నారు. ‘మీ మాటల గారడీ, అబద్ధాలు ఈ ఎన్నికల్లో చెల్లవు. చౌకీదార్‌నంటూ వేసిన కొత్త ఎత్తుడగ కూడా మిమ్మల్ని కాపాడలేదు’ అంటూ మోదీపై ఆమె మండిపడ్డారు. చివరకు గంగామాత కూడా బీజేపీ పట్ల సంతోషంగా లేదని, ఈ ఎన్నికల్లో గంగామత ఆశీర్వాదం వారికి లభించదని మాయావతి ధీమా వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *