మోదీ ప్రధానిగా ఇకపై ఉండరు: చంద్రబాబు


అమరావతి: మోదీ ప్రధానిగా ఇకపై ఉండరని సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. శ్రీకాకుళం పార్లమెంటరీ సమీక్షలో సీఎం మాట్లాడుతూ మోదీపై ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక గాలిని ఉధృతం చేశామని చెప్పారు. అలాగే బీజేపీ వ్యతిరేక శక్తులను కూడా ఏకం చేశామని తెలిపారు. ఓటమి భయంతోనే మోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 26 ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ గురించి మాట్లాడుతున్నారంటేనే అర్థమవుతుందన్నారు. గత ఐదేళ్లలో మోదీ చేసింది ఏమీలేదు కాబట్టే చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
 
దేశానికి రాబోయేది కొత్త ప్రధానే.. మోదీ ప్రధానిగా ఇకపై ఉండరని వివరించారు. భారత రాజకీయాల్లో హుందాతనం మోదీ వల్లే కొరవడిందని చెప్పారు. గుజరాత్ మోడల్ అనేది మోదీ సృష్టించిన శూన్యం తప్ప ఏమీలేదన్నారు. టీడీపీతో పెట్టుకున్నప్పుడే మోదీ పతనం ప్రారంభం అయ్యిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రం కోసమే బీజేపీపై తిరగబడినట్లు వెల్లడించారు. ప్రత్యర్ధులపై ఈడీ, ఐటీ ద్వారా కక్షసాధింపు గతంలో లేదని పేర్కొన్నారు. ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసమే తొలిసారి సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు స్పష్టంచేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *