మోదీ మళ్లీ ప్రధాని కావాలన్న ‘రీల్ మోదీ’!


న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రిగా మళ్లీ నరేంద్ర మోదీనే రావాలని కోరుకుంటున్నట్టు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు. మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాలో ఆయన ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బీజేపీ నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వివేక్, మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ యువరాజులు, విదేశీయులు మనల్ని పాలించినప్పుడల్లా… వారు కేవలం దేశాన్ని దోచుకు తిన్నట్టు భారత చరిత్ర మనకు చెబుతుంది. ఇప్పుడు దేశ పౌరులు, ‘చౌకీదారులు’ ఈ దేశాన్ని మళ్లీ దోచుకునేందుకు అవకాశం ఇవ్వరు…’’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని వివేక్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయం ఖాయమైంది. మళ్లీ ప్రధానిగా ఆయనే వస్తారు. ఇప్పుడు, దేశాన్ని ఎవరూ దోచుకోలేరు. దానికి బదులు దేశం అభివృద్ధి దిశగా ఎదుగుతుంది…’’ అని వివేక్ వ్యాఖ్యానించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *