మోదీ.. మీ కర్మ ఎదురుచూస్తోంది!


  • మా నాన్ననే అవినీతిపరుడంటారా?
  • ప్రధానిపై రాహుల్‌, ప్రియాంక ధ్వజం
న్యూఢిల్లీ, మే 5: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజీవ్‌గాంధీ నంబర్‌ 1 అవినీతిపరుడిగా నిలిచిపోయారన్న మోదీ విమర్శలపై ఘాటుగా స్పందించారు. ‘‘మోదీజీ యుద్ధం ముగిసింది. మీ కర్మ ఫలం మీ కోసం ఎదురుచూస్తోంది. మీ సొంత నమ్మకాలను మా నాన్నకు ఆపాదించి మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు’’ అంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ప్రియాంక గాంధీ కూడా మోదీపై ధ్వజమెత్తారు. ‘‘అమరుల పేరిట ఓట్లు అడుక్కుంటున్న ప్రధాని ఒక అమరవీరుణ్ని అగౌరవపరిచారు. ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్‌ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీకు అమేఠీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
 
నిజం మోదీజీ.. ఈ దేశం మోసాన్ని ఎప్పుడూ క్షమించదు’’ అని ప్రియాంక ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం కూడా మోదీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రధాని హద్దులు దాటి మాట్లాడారని ఆరోపించారు. మాజీ ప్రధాని రాజీవ్‌పై వచ్చిన ఆరోపణలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిందని, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లకూడదని బీజేపీ ప్రభుత్వమే నిర్ణయించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రధానికి సూచించారు. ఒక ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్‌ నేత శాం పిట్రోడా అన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *