'మోదీ వైపు వేలెత్తి చూపితే చేతులు కత్తిరించేస్తాం'


మండి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఇటీవల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను 48 గంటల సేపు ఎన్నికల ప్రచారం చేయకుండా ఈసీ వేటుపడిన హిమాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్ సత్పాల్ సింగ్ సత్తి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో బుధవారంనాడు ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూ, ప్రధాని మోదీని వేలెత్తి చూపే వాళ్ల చేతులు కత్తిరించి పారేస్తారని హెచ్చరించారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
 
కాగా, ఈనెల 14న రాహుల్ గాంధీపై సత్యాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ధరించిన వస్త్రధారణపై సత్పాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేవలం ఓట్ల కోసమే ప్రియాంక తన వస్త్రధారణను మార్చినట్లు ఆయన ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై ఈసీ నోటీసు ఇచ్చి, ఆ తర్వాత 48 గంటలు పాటు ప్రచారం చేయకుండా ఆయనపై వేటు వేసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *