యశ్వంతపూర్‌ – హౌరాల మధ్య రేపు తత్కాల్‌ సూపర్‌ఫాస్ట్‌


బెంగళూరు: వేసవి రద్దీ నేపథ్యంలో నైరుతి రైల్వే యశ్వం తపూర్‌ – హౌరాల మధ్య ప్ర త్యేక రైలును ఒకరోజుకోసం నడపనుంది. య శ్వం తపురంలో ఈ రైలు మే 6న తెల్లవారుజా మున 2.40కు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50కు హౌరా చేరుకుంటుంది. ఈ రైలు కృష్ణరాజపురం, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయ నగరం స్టేషన్‌లలో ఆగుతుందని ప్రకటన పేర్కొంది. ఒక ఏసీ టూటైర్‌ కోచ్‌, 2 ఏసీ త్రీటైర్‌ కోచ్‌లు, 8 సెకండ్‌క్లాస్‌ స్లీపర్‌ కోచ్‌లు, 6 సెకండ్‌ క్లాస్‌ జనరల్‌ కోచ్‌లు ఉంటాయని ప్రకటన పేర్కొంది. ‘ఫణి’ పెనుతుఫాను కారణంగా ఈ మార్గంలో పలు రైళ్ళు రద్దు కావడంతో ఈ ప్రత్యేక తత్కాల్‌ రైలును నడుపుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *